Thursday, May 20, 2010

ఎందుకు బ్లాగ్ కంటిన్యూ చేయట్లేదో..ఏమైందో ఏమో గాని ....కొంచం అశ్రద్ధ చేశాను...but i decided...ఇంక continue చేద్దామని...చాలా విషయాలు ఉన్నాయి రాయటానికి.ఎపుడు గుర్తుకు వస్తే అపుడు చెప్తాను.god bless.....

Tuesday, February 23, 2010

మై నేమ్ ఈజ్ khan


సరదాగా ఫ్రెండ్స్ తో డిన్నర్ కి వెళ్ళాను..10గంటలకి గీతామాధురి ఫోన్..అన్న ..మై నేమ్ ఈజ్ ఖాన్.మూవీకి రెండు టికెట్స్ ఉన్నాయి వెళ్తావా అని...ఓకే అన్నా..తప్పకుండ చూడాల్సిన సినిమా ....ఒక ఆర్టిస్ట్ ఎంత కష్టపడితే లెజెండ్ అయ్యాడో నిదర్శనం shaarukh khan ..alage kajol kudaaa.....plz watch the movie....

Tuesday, February 16, 2010

ఎక్కడికి ప్రయాణం చేస్తున్నానో ..ఎంత దూరం వెళ్తానో...నా గమ్యం ఏంటో ....తెలియట్లేదు.బాలు గారితో కచేరిలు ,కోటి గారికి కంపోసింగ్ అసిస్టెంట్ ,వీడో మంచి సింగర్ అన్న పేరు ఉంది ..కానీ వీడికి ఈ పాట మంచి పేరు తెస్తుంది అన్న పాట ఎపుడు వస్తుందో..చాల మంది మీద నయమే.లక్కీ నే.అవకాశాలు ఉన్నాయి.కానీ ఇంకా పాడాలి.చూడడం.భగవంతుడు ఏమి చేస్తాడో...

Wednesday, September 23, 2009

మొదటి అమెరికా ప్రయాణం




అలా అలా చక్కగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా శ్రీ s.p.బాలు గారితో సంగీత కచ్చేరీ లు చేస్తున్న ఒక శుభ వేళలో మనం కలిసి అమెరికా వెళ్తున్నాం కృష్ణ అన్నారు బాలు గారు.అబ్బ నాకు అంత ఉందా అనుకున్నాను...కాని అంతా మన ఇష్టమా ??పైన దేవుడు ఉన్నాడు కదా.ఒక రోజు చెన్నై లో వీసా ఇంటర్వ్యూ కి వెళ్ళాము...ఆ తెల్ల దొర నన్ను మొదటగా పిలిచాడు...ఎందుకంటే ఆ ట్రూప్ లో నేను ఒక్కడినే మొదటి సారి ప్రయాణం చేసేది.వెళ్ళాను..ఒక పాట పాడమన్నాడు..సాగరసంగమం లో నాద వినోదము పాట పాడను.. నాతో బాలు గారు కూడా గొంతు కలిపారు.వీసా వచ్చేసింది.తరువాత ఇంకో ఝలక్ ఏంటంటే బాలు గారితో నేను కాకుండా ఇంకా ఎవరెవరు పాడుతున్నారో తెలిసింది...నాకెంతో ఇష్టమైన s.p.శైలజ గారు,చిన్న కోకిల చిత్ర గారు..ఏమి నా భాగ్యము అని మురిసిపోయాను....నా చిన్నప్పటినుండి చూస్తున్న ఆ మహా గాయకులతో నా ఫొటోస్ చుస్తూ ఆ దేవుడికి థాంక్స్ చెప్పుకున్నాను.నా జన్మ ధన్యం అయ్యింది అనుకున్నాను...లేకపోతే ఎంత మంది గాయకులూ...ఈ రోజున ఇంటి ఇంటిలో ప్రతి ఇంటిలో బాగా పాడేవాళ్ళు చాల బాగా ఉన్నారు..ఆ అదృష్టం నాకు దక్కినందుకు సంతోషం కలిగింది...చెన్నై లోని శైలజ గారి ఇంటిలో ప్రాక్టీసు మొదలెట్టాము...సుభాలేక సుధాకర్ గారు శైలజ గారు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారో.చిత్ర గారు కూడాప్రాక్టీసు కి వచ్చారు...వాళ్ళు ఇంత స్థాయిలో ఉండటానికి గల కారణాలు అప్పుడు తెలిసాయి..అందరికి అన్ని వచ్చిన పాటలే..కాని ఆ డెడికేషన్,పాట పట్ల గౌరవం,ప్రేమ వాళ్ళని ఇంత ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టింది..అందుకే వాళ్ళు అందరికి ఆదర్శం అయ్యారు...ఇంక ఫ్లైట్ ఎక్కే రోజు రానే వచ్చింది..

శ్రీ బాలు గారికి చాలా ఇష్టమైన సంగీత బృందం చిన్నా గారు,ప్రవీణ్ n.c,flute రవి గారు,కాంగో ఫణి గారు,పాడ్స్ కృష్ణ గారు,స్వామి గారు,గిటార్ అలెగ్జాండర్ గారు,శ్రీనివాస్ గారు,తబలా వేణు గారు,పాల్ రాజ్ గారు,సౌండ్ ఇంజనీర్ అహ్మద్ గారు,ఆహ ఆహ ఎంత మంచి సంగీత కళాకారులు అంటే మాటల్లో చెప్పలేము .మీరు తప్పకుండా వినాల్సిందే.అహంభావం లేని గొప్ప కళాకారులు వారు.వాళ్ళంటే నాకు కొంచం భయం.భక్తి..ఎందుకంటే వాళ్ళు ప్లే చేసీ ఏ పాట ఐన perfect గా ఉంటుంది.అమ్మో,నేను సరిగ్గా పాడాలి అనుకుంటూ ఇంకా బాగా ప్రాక్టీసు చేస్తాను..నేనంటే వాళ్ళకి చాల ఇష్టం..చాల సరదాగా ఉంటారు నాతో..బాగా పాడితే మెచ్చుకుంటారు..పది మందికి చెప్తారు.తప్పు పాడిన చెప్తారు..కానీ నా ఒక్కడితోనే..అందరికి కాదు..అదే వాళ్ల గొప్పతనం.వాళ్ళు అంత happy గ ఉండాలని కోరుకుంటున్నాను..అన్నట్టు నేను చెప్పాల్సిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారండోయి.బాలు గారు చెప్పగానే ఒప్పుకొని నన్ను అమెరికా తేవటానికి ముఖ్య కారకురాలయిన kalaa iyer గారు..వారి ఆప్యాయత మర్చిపోలేనిది..వారికీ కుడా నా థాంక్స్ చెప్పుకుంటున్నాను...ఇదిగో మా అందరి ఫోటో.చుడండి...






మధుర క్షణాలు


feb 8 ..ఆ రోజు ఉత్తినే అలా saloon కి వెళ్ళాను....ఇంతలో సడన్ గ ఒక ఫోన్ కాల్ వచ్చింది...praivate number అని display అయ్యింది..సరే, ఫోన్ ఎత్తాను.హలో శ్రీకృష్ణ, నేను s.p.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను అన్న ఆ గొంతు విని షాక్ లో ఉండిపోయాను...తేరుకున్నాను..చెప్పండి సర్..అన్నాను..రేపు శివరాత్రి సందర్బంగా సంగారెడ్డి అనే ఊరిలో మనం ప్రోగ్రమ్మే చేయ్యబోతున్నాము .మీరు పాడే పాటలు కొన్ని చెప్పండి అన్నారు..ఒక నాలుగు పాటలు చెప్పాను.తరువాత ఇంక నేను నేనుగా లేనే...స్వర్గలోకం అంచుల దాకా వెళ్ళిపోయాను.నా ఆనందాన్ని ఊరు మొత్తం పంచుకున్నాను..

అంతటి మహానుభావుడు ,గాన గంధర్వుడు ,సంగీత బ్రహ్మ నాకు ఫోన్ చేసి ఆయనతో కలిసి నన్ను పాడమన్నా ఆ క్షన్మ లో నా కళ్ళ వెంట జల జల కారిన ఆ కన్నీటి బోట్లు nఆకు ఎంత ఆనందాని ఇచ్చిందో నా మనసుకే తెలుసు...తరువాతి రోజు.. సంగారెడ్డి లో శివరాత్రి పర్వదినాన ఆ బాలు గారితో నేను నా గళం ఎంత ఉప్పొంగిందో ఆ పరమశివునికే తెలుసు ....బాలు గారు..నా ఆయుషు లో మీకు ఎంత ఇచ్చిన తీరనిది...మీరు కలకాలం మీ కమ్మటి స్వరాలతో చిరంజీవి గ బ్రతకాలని ఆ దేవుడిని మనసార వేడుకుంటున్నాను.thank u sir....


Tuesday, September 22, 2009

శ్రేయ తో నేను ఉన్నా అని తెలిస్తే వచ్చే సంబంధాలు కూడా రావు



పైన రాసిన రాత నాది కాదు బాబోయ్ ....

ఆహా ఏమి రుచి

అద్భుతంగా జరిగిన మొన్నటి న్యూజెర్సీ programme అయిన తరువాత సరదాగా నా ఫ్రెండ్స్ హిమ బిందు,వంశి,లాలస,హనుమ లతో కలిసి డిన్నర్ కి వెళ్ళాను...న్యూ జెర్సీ లో అభిరుచి లో ఆ భోజనం చాలా బాగుంది...