అలా అలా చక్కగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా శ్రీ s.p.బాలు గారితో సంగీత కచ్చేరీ లు చేస్తున్న ఒక శుభ వేళలో మనం కలిసి అమెరికా వెళ్తున్నాం కృష్ణ అన్నారు బాలు గారు.అబ్బ నాకు అంత ఉందా అనుకున్నాను...కాని అంతా మన ఇష్టమా ??పైన దేవుడు ఉన్నాడు కదా.ఒక రోజు చెన్నై లో వీసా ఇంటర్వ్యూ కి వెళ్ళాము...ఆ తెల్ల దొర నన్ను మొదటగా పిలిచాడు...ఎందుకంటే ఆ ట్రూప్ లో నేను ఒక్కడినే మొదటి సారి ప్రయాణం చేసేది.వెళ్ళాను..ఒక పాట పాడమన్నాడు..సాగరసంగమం లో నాద వినోదము పాట పాడను.. నాతో బాలు గారు కూడా గొంతు కలిపారు.వీసా వచ్చేసింది.తరువాత ఇంకో ఝలక్ ఏంటంటే బాలు గారితో నేను కాకుండా ఇంకా ఎవరెవరు పాడుతున్నారో తెలిసింది...నాకెంతో ఇష్టమైన s.p.శైలజ గారు,చిన్న కోకిల చిత్ర గారు..ఏమి నా భాగ్యము అని మురిసిపోయాను....నా చిన్నప్పటినుండి చూస్తున్న ఆ మహా గాయకులతో నా ఫొటోస్ చుస్తూ ఆ దేవుడికి థాంక్స్ చెప్పుకున్నాను.నా జన్మ ధన్యం అయ్యింది అనుకున్నాను...లేకపోతే ఎంత మంది గాయకులూ...ఈ రోజున ఇంటి ఇంటిలో ప్రతి ఇంటిలో బాగా పాడేవాళ్ళు చాల బాగా ఉన్నారు..ఆ అదృష్టం నాకు దక్కినందుకు సంతోషం కలిగింది...చెన్నై లోని శైలజ గారి ఇంటిలో ప్రాక్టీసు మొదలెట్టాము...సుభాలేక సుధాకర్ గారు శైలజ గారు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారో.చిత్ర గారు కూడాప్రాక్టీసు కి వచ్చారు...వాళ్ళు ఇంత స్థాయిలో ఉండటానికి గల కారణాలు అప్పుడు తెలిసాయి..అందరికి అన్ని వచ్చిన పాటలే..కాని ఆ డెడికేషన్,పాట పట్ల గౌరవం,ప్రేమ వాళ్ళని ఇంత ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టింది..అందుకే వాళ్ళు అందరికి ఆదర్శం అయ్యారు...ఇంక ఫ్లైట్ ఎక్కే రోజు రానే వచ్చింది..
Wednesday, September 23, 2009
మొదటి అమెరికా ప్రయాణం
మధుర క్షణాలు
feb 8 ..ఆ రోజు ఉత్తినే అలా saloon కి వెళ్ళాను....ఇంతలో సడన్ గ ఒక ఫోన్ కాల్ వచ్చింది...praivate number అని display అయ్యింది..సరే, ఫోన్ ఎత్తాను.హలో శ్రీకృష్ణ, నేను s.p.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను అన్న ఆ గొంతు విని షాక్ లో ఉండిపోయాను...తేరుకున్నాను..చెప్పండి సర్..అన్నాను..రేపు శివరాత్రి సందర్బంగా సంగారెడ్డి అనే ఊరిలో మనం ప్రోగ్రమ్మే చేయ్యబోతున్నాము .మీరు పాడే పాటలు కొన్ని చెప్పండి అన్నారు..ఒక నాలుగు పాటలు చెప్పాను.తరువాత ఇంక నేను నేనుగా లేనే...స్వర్గలోకం అంచుల దాకా వెళ్ళిపోయాను.నా ఆనందాన్ని ఊరు మొత్తం పంచుకున్నాను..
అంతటి మహానుభావుడు ,గాన గంధర్వుడు ,సంగీత బ్రహ్మ నాకు ఫోన్ చేసి ఆయనతో కలిసి నన్ను పాడమన్నా ఆ క్షన్మ లో నా కళ్ళ వెంట జల జల కారిన ఆ కన్నీటి బోట్లు nఆకు ఎంత ఆనందాని ఇచ్చిందో నా మనసుకే తెలుసు...తరువాతి రోజు.. సంగారెడ్డి లో శివరాత్రి పర్వదినాన ఆ బాలు గారితో నేను నా గళం ఎంత ఉప్పొంగిందో ఆ పరమశివునికే తెలుసు ....బాలు గారు..నా ఆయుషు లో మీకు ఎంత ఇచ్చిన తీరనిది...మీరు కలకాలం మీ కమ్మటి స్వరాలతో చిరంజీవి గ బ్రతకాలని ఆ దేవుడిని మనసార వేడుకుంటున్నాను.thank u sir....
Tuesday, September 22, 2009
ఆహా ఏమి రుచి
అద్భుతంగా జరిగిన మొన్నటి న్యూజెర్సీ programme అయిన తరువాత సరదాగా నా ఫ్రెండ్స్ హిమ బిందు,వంశి,లాలస,హనుమ లతో కలిసి డిన్నర్ కి వెళ్ళాను...న్యూ జెర్సీ లో అభిరుచి లో ఆ భోజనం చాలా బాగుంది...
ఇది నా మొదటి పోస్ట్ కాదు .. శ్రీ రాసాడు
ఈ రోజే న్యూ జెర్సీ లో రాజీవ్ వాళ్ళ ఇంటికి బోజనానికి వచ్చా ... పని పాటా లేని శ్రీ ఈ బ్లాగ్ మొదలు పెట్టించాడు .. దీన్ని continue చేస్తానా లేదా అన్నది చూడాలి మరి ....
Subscribe to:
Posts (Atom)